Header Banner

టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఉపాధ్యాయులపై ప్రభుత్వం వేగవంతం! ఫలితాలు ఎప్పుడంటే?

  Sun Apr 06, 2025 07:54        Education

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. పదో తరగతి జవాబు పత్రాల ముల్యాంకనం ఏడు రోజుల్లోగా పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మూల్యాంకనం ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమవగా.. ఏప్రిల్‌ 9 నాటికి పూర్తి చేసేలా కార్యచరన రూపొందించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 3,100 మంది ఉపాధ్యాయులకు ఆ విధులు కేటాయించారు. వీరు మొత్తం 3.20 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయనున్నారు. ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాకు చెందిన 1.80 లక్షల పేపర్లు ఉన్నాయి. వీటి మూల్యాంకనానికి 1268 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. ఈసారి చాలా ముందుగానే ఫలితాలను వెల్లడించాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం ఈ మేరకు రికార్డుస్థాయిలో మూల్యాంకనం ప్రక్రియకు ఉపాధ్యాయులను కేటాయించింది. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్‌ నెలాఖరులోపే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

అందుకోసం ఎక్కువ మంది ఉపాధ్యాయులతో సకాలంలో మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా సమాధాన పత్రాలను స్టాల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. మూల్యాంకనం అక్కడే జరిగేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్‌ 9 వరకు మూల్యాంకనం ప్రక్రియ పకడ్భందీగా నిర్వహించనున్నారు. ప్రతీ ఉపాధ్యాయుడికి ఒక్కోరోజు తొలుత 40 పేపర్ల చొప్పున మూల్యాంకనానికి ఇస్తారు. నిర్దేశిత వ్యవధిలోగా దిద్దితే మరో 10 పేపర్లు కూడా వారికి ఇస్తారు. మరోవైపు పల్నాడు జిల్లాలో మూల్యాంకనం కోసం ప్రధానోపాధ్యాయులతోపాటు కొన్ని పాఠశాలల్లోని మొత్తం ఉపాధ్యాయులను పంపుతుండడంతో అక్కడ 3 నుంచి 9 తరగతుల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. క్లాసులు ఎవరు నిర్వహించాలో తెలియక అవస్థలుపడుతున్నారు. ఇక ఏపీ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్యలో పది, ఇంటరు పరీక్షలు రాసిన 16,500 మంది పేపర్లను ఉమ్మడి గుంటూరులో మూల్యాంకనం చేయనున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AP10thResults2025 #AnswerSheetEvaluation #TeachersTaskForce #APEducationDept